![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు '. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1010 లో... ఫణీంద్ర దగ్గర నుండి మహేంద్ర రాగానే అనుపమ, వసుధారలు ఇద్దరు కలిసి మాట్లాడతారు. మీ అన్నయ్య ఎందుకు పిలిచారని అడుగుతారు. అది చెప్తే నువ్వు తట్టుకేలేవు అమ్మ అని మహేంద్ర మనసులో అనుకుని క్యాజువల్ గా పిలిచాడు. హెల్త్ బాగుండడం లేదట అందుకే అని మహేంద్ర అంటాడు. ఆ విషయం చెప్పకుండా మరి ఎందుకు ఆలోచిస్తున్నారని వసుధార అడుగుతుంది. ఏం లేదంటు మహేంద్ర వెళ్ళిపోతాడు. మావయ్య గారు ఏదో దాస్తున్నారని వసుధారకి డౌట్ వస్తుంది.
ఆ తర్వాత అక్కడ ఏం జరిగి ఉంటుంది. శైలేంద్ర మళ్ళీ ఏదైనా ప్లాన్ చేశాడా? ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా అని వసుధార అనుకొని ధరణికి ఫోన్ చేస్తే అన్ని విషయాలు చెప్తుందని తనకి కాల్ చేస్తుంది. కానీ ధరణి ఫోన్ శైలేంద్ర దగ్గర ఉంటుంది. రింగ్ అవుతున్నా ఫోన్ ని శైలేంద్ర పట్టుకొని వసుధార దగ్గరికి వస్తాడు. మా ఆవిడకి ఎందుకు కాల్ చేస్తున్నావ్ ? వంటింటి చిట్కాలు తెలుసుకోవడానికా లేకపోతే ఇంట్లో రహస్యాలు తెలుసుకోవడానికా అని శైలేంద్ర అంటాడు. ఫోన్ మీ దగ్గర ఉందేంటని వసుధార అనగానే.. మా ఆవిడా ఫోన్ ఇది. మేమ్ అప్పుడు అప్పుడు ఇలా ఎక్స్చేంజ్ చేసుకుంటామ్ లే అని శైలేంద్ర అంటాడు. అసలు బాబాయ్ మా ఇంటికి ఎందుకు వచ్చారనే కదా.. నాకు తెలుసు కానీ నేను చెప్పను. నువ్వే మీ మావయ్యని మళ్ళీ అడుగని శైలేంద్ర చెప్పేసి వెళ్ళిపోతాడు. వాళ్ళ మాటలని దూరంగా ఉండి మను వింటు ఉంటాడు.
ఆ తర్వాత పాపం వసుధారకి ఈ విషయం చెప్పాలని ధరణి అనుకొని అక్కడ హాల్లో ఉన్న దేవయాని ఫోన్ నుండి చేయబోతుంటే దేవయాని వచ్చి చూస్తుంది. నాకు తెలుసే.. ఇలాంటివి చేస్తావని అందుకే ఫోన్ కావాలనే ఇక్కడ పెట్టాను. మా మాట అంటే నీకు లెక్క లేదా అంటు ధరణిని దేవయాని తిడుతుంది. ఆ తర్వాత మీరు సంతకం చేస్తున్నారా అని మనుని వసుధార అడుగుతుంది. లేదు మీరు చేశాకే చేస్తానని మను అనడంతో వసుధార కోపంగా అక్కడ నుండి వెళ్తుంది. ఆ తర్వాత వసుధార ఇంటికి వెళ్లి.. మీరు నా దగ్గర ఏదైనా దాస్తున్నారా శైలేంద్ర అలా అంటున్నాడని మహేంద్రతో వసుధార అంటుంది. నన్ను ఇలా ఇరికించావా శైలేంద్ర అని మహేంద్ర మనసులో అనుకుంటాడు. ఏం దాచట్లేదని వసుధారతో మహేంద్ర చెప్తాడు. ఆ తర్వాత రిషి గురించి ఫణీంద్ర ఎమోషనల్ అవుతాడు. ఇప్పుడైన వీళ్ళ గురించి నిజం చెప్పాలని ధరణి అనుకొని.. మీకు ఒక విషయం చెప్పాలి మావయ్య అంటుంది. నా గురించే కదా అంటు దేవయాని డైవర్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |